బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయాలి: తహసీల్దార్, ఎస్‌ఐ పిలుపు
ట్రూ టైమ్స్ ఇండియా, సెప్టెంబర్ 29:
మండల పరిధిలోని హరేసముద్రం గ్రామంలో సోమవారం చట్టాలు, పౌరుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మునివేలు, సబ్-ఇన్‌స్పెక్టర్ నబిరసూల్, మండల సర్వేయర్ రవితేజ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మరియు ఎస్‌ఐ మాట్లాడుతూ... మండలంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అదేవిధంగా, పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోక్సో చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
భద్రతకు ప్రాధాన్యత:
ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని వారు ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఏదైనా సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు దృష్టికి వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్ మునివేలు, సబ్-ఇన్‌స్పెక్టర్ నభిరసుల్, మండల సర్వేయర్ రవితేజతో పాటు ఆర్.ఐ. రామాంజనేయులు, వీఆర్వో, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments
Post a Comment