ఒకే ఒక్కడు.తలనీలాల వేలం పాటదారుడు

Malapati
0

 

-మిగతా ఏడుగురు ఎక్కడ?

-తలనీలాలు, పాత్ర సామానుల వేలాలు తూచ్..

-కౌలు భూముల వేలాలు లేవోచ్. 

పలు వేలం పాటలు వాయిదా వేశారు. ఆశించిన స్థాయిలో ఆదాయం రానందుకు అధికారులు వాయిదా వేశారు. తలనీలాల వేలం పాటకు 8 మంది డిపాజిట్ చెల్లించగా కేవలం ఒకే ఒక్క పాటదారు హాజరు అయ్యారు. మిగతా ఏడుగురు గైర్ హాజరైయ్యారు దేవస్థాన భూములు కౌలు వేలం పాటలు సైతం వాయిదా వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.ఉరవకొండ మండలంపెన్నహోబిలం .
 దేవస్థానము లో తలనీలాలు ప్రోగు చేసుకోను హక్కు కోసం 08 మంది డిపాజిట్ జమ చేయగా ఒక్క పాటదారుడే మాత్రమే పాట పాడినారు, రూ.21,00,000/- దగ్గర పాట ఆగినది, పాత్ర సామానులు బాడుగకు ఇచ్చుకొను హక్కు పాట పాడుకొనుటకు ఎవ్వరు ముందుకు రాలేదు కలగలపు బియ్యము బేడలు అమ్ముకొను హక్కుకు 04 మంది డిపాజిట్టు కట్టగ 1కేజి కి రూ.20/- ప్రకారం సి.రాము, కోనాపురము అను వారు పాట దక్కించుకున్నారు. గతములో కంటే ఈ సంవత్సరము తలనీలాలు ప్రోగు చేసుకోను హక్కు, పాత్ర సామానులు బాడుగకు ఇచ్చుకొను హక్కు సరైన పాటరానందున వేలము పాట నిలుపుదల చేసి వాయిదా వేయడం జరిగినది. మరియు మధ్యాహ్నం 01:00 గంటలకు దేవస్థానం సంబంధించిన భూములు కౌలుకు ఇచ్చుటకు వేలము నిర్వహించగా గుత్తదారులు ఎవ్వరు ముందుకు రానందున వేలము వాయిదా వేయడమైనది.

ఈ కార్యక్రమము లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సి.యన్ తిరుమల రెడ్డి , పర్యవేక్షణాధికారి సత్యసాయి జిల్లా దేవదాయ శాఖ అధికారి బి. నరసింహ రాజు సమక్షంలో నిర్వహించడం జరిగినది. 

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!