సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ నియామకం ఇప్పటివరకు జరగలేదు.
అయితే ఇటీవల జిల్లాకు ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఓ పచ్చ పత్రిక లో పెన్నహోబిలం పాలకమండలి మరియు ట్రస్ట్ చైర్మన్ హోదా అంటూ ఓ టిడిపి నాయకుడు తమకు తాము ముందస్తు ప్రకటన వేయించటంతో పలువురు భక్తులు నివ్వెర పోయారు. అధికారికంగా ఇప్పటివరకు నియామకం జరగలేదు. ఈ పోస్టు తనకే దక్కుతుందన్న అతి విశ్వాసంతో ఆయన ఆ ప్రకటన గుప్పించారు. అప్పటినుంచి దేవస్థాన సిబ్బందిపై, అధికారులపై ఆ నాయకుడు పెత్తనం చెలాయించటంతో సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇల్లు కట్టకనే ఎలకల రావిడి అన్న చందంగా ఆయన తీరు మారినట్లు సిబ్బంది విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు సిబ్బంది నాయకుని చర్యల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు
అయితే ఇటీవల జిల్లాకు ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఓ పచ్చ పత్రిక లో పెన్నహోబిలం పాలకమండలి మరియు ట్రస్ట్ చైర్మన్ హోదా అంటూ ఓ టిడిపి నాయకుడు తమకు తాము ముందస్తు ప్రకటన వేయించటంతో పలువురు భక్తులు నివ్వెర పోయారు. అధికారికంగా ఇప్పటివరకు నియామకం జరగలేదు. ఈ పోస్టు తనకే దక్కుతుందన్న అతి విశ్వాసంతో ఆయన ఆ ప్రకటన గుప్పించారు. అప్పటినుంచి దేవస్థాన సిబ్బందిపై, అధికారులపై ఆ నాయకుడు పెత్తనం చెలాయించటంతో సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇల్లు కట్టకనే ఎలకల రావిడి అన్న చందంగా ఆయన తీరు మారినట్లు సిబ్బంది విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు సిబ్బంది నాయకుని చర్యల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరుపాలకమండలి చైర్మన్ నియామకం, ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే ఆ నాయకుని చర్యలతో సిబ్బందిలో లుకలుకలు మొదలయ్యాయి.. అతని చర్యలను ఖండిస్తే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని మరికొందరిలో భయాందోళనలు అల్బుకున్నాయి.
పాలకమండలి ఆశావాహుల్లో ఇది మింగుడు పడటం లేదు. పాలకమండలి చైర్మన్ పదవి కోసం భాజపా పార్టీ ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ మహిళా నేత రేసులో ఉన్నారు. అనధికారిక చైర్మన్ గా ప్రకటించుకున్న వ్యక్తికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అండదండలు ఉండగా, మహిళా బిజెపి నేతకు అగ్ర నేత దగ్గుపాటి పురందేశ్వరి తో కలిగి ఉన్నాయి. మహిళా కోటా కింద దక్కే అవకాశం ఉంది. వీటికి తోడు శ్రీ శక్తి పథకం కింద మహిళలకు ఇప్పటికే చంద్రన్న ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నారు. బిజెపి నేతకు ఇది రెండవ ప్లస్ పాయింట్. వీటికి తోడు పదవుల పందేరంలో బిజెపి కూటమి భాగస్వామిగా ఉంది. ఆ కోట కింద అయినా పదవి లభించే ఛాన్సు అధికంగా ఉంది. ఎవరికి వారే చైర్మన్ హోదా తమకు దక్కుతుందంటే తమకు దక్కుతుందనే భావనలు వారి వారిలో నెలకొన్నాయి.
అయితే అనధికారిక హోదాలో చైర్మన్ కాకమునుపే చైర్మన్ అంటూ ప్రకటనలు గుప్పించటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అనధికార హోదాలో సిబ్బందిపై పెత్తనం జులుము ప్రదర్శించడం సరికాదనే భావనలు సిబ్బంది సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనాప్పటికీ కూటమి భాగస్వామ్య పార్టీ బిజెపి మహిళా నేతకు దక్కుతుందా లేక టిడిపి నేతకు దక్కుతుందా అనే విషయంలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా చర్చ కొనసాగుతుంది.
ఏది ఏమైనప్పటికే పయ్యావుల సోదరుల మాటే శాసనం. వారి నిర్ణయమే కీలకం.
