-అసెంబ్లీ లో ఎం ఎల్ ఏల్ లు:పరిటాల సునీత, బండారు శ్రావణి పునరుద్దరణ చర్చలు.
-జిల్లా వ్యాప్తంగా పెల్లుబుకిన నిరసన జ్యాలలు
-ట్రూ టైమ్స్ ఇండియా:
ప్రభుత్వ0 ఆర్ డి టి సేవలకు బ్రేకు లేయోద్దంటూ అలాగే ఫెరా చట్టాన్ని పునరుద్ధరించాలన్ని అభివృద్ధి కామకులు బిజెపి మాజీ తాలూకా యువ మోర్చా అధ్యక్షులు, జిల్లా భారతీయ మజ్దూర్ సంఘ్ ఉపాధ్యక్షులు, ఆర్ డి టి మాజీ ప్రధానోపాధ్యాయులు మాలపాటి శ్రీనివాసులు, జై కిసాన్ ఫౌండర్ నాగమల్లి ఓబులేశు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఆర్ డి టి సేవా సంస్థప్రభుత్వ సేవలకు ధీటుగా సేవలందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం మంచిని స్వాగతించాలన్నారు. అనంతపురం కరువు జిల్లాలో స్థాపించి జిల్లా ఆమూలాగ్రం ఎస్సీ,ఎస్టీ,బడుగు బలహీన వర్గాలకు విద్యా, వైద్య సేవలు అందించిన ఘనత ఆర్ డి టి కే దక్కుతుందన్నారు.
గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు నడుం బిగించిందన్నారు. విద్యా బోధనకు అవసరమైన పాఠశాలలో నిర్మించి, తద్వారా ఎంతోమందిని తీర్చిదిద్దిన ఘన కీర్తి ఆర్డిటిదే అనివారు కొనియాడారు.
వైద్యం కోసం ఆసుపత్రులు నిర్మించి తద్వారా పేదలకు రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తోందని గుర్తు చేశారు.
ప్రభుత్వం నిర్మించలేని ఎన్నో ఇళ్లను నిర్మించి నివాసాలు కల్పించారన్నారు.
ఆర్డిటి స్కూల్స్ పాటు కార్పొరేట్ స్థాయిలో విద్య అభ్యాసకులకు కార్పొరేట్ చదువులకయ్య ఖర్చులు భరించింది ఎవరని అడిగితే ఆర్డిటిని అని టక్కువమని సమాధానం చెబుతారని గుర్తు చేశారు.
రైతులు రైతు కూలీల అవసరాల కోసం భూసార పరిరక్షణ కుంటకట్టలు ఏర్పాటు, ఊట చెరువులు తవ్వించి తద్వారా అభివృద్ధి బాటలు వేసిన సంస్థ ఆర్డిటి.
సేవే ధ్యేయంగా పనిచేసింది. నిరుద్యోగం తాండవిస్తున్న జిల్లాలో ప్రభుత్వం చేయలేని ఎన్నో పనులను నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. ఎందరో యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలిచింది నిలుస్తోంది. జిల్లా ప్రజల గుండెల్లో శాశ్వతముద్ర వేసుకుంది. తన సేవా పరంపర ఇతర జిల్లాలకు సైతం విస్తరించింది. ఏ పార్టీకి వత్తాసుపలకకుండా రాజకీయాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న ఆర్ డి టి సంస్థకు కూటమి ప్రభుత్వం ముగుదాడు వేయ సంకల్పించుట సరైన చర్య కాదని ధ్వజ మెత్తారు.
విన్సెంట్ ఫెర్రర్, ఆయన సతీమణి శ్రీమతి అన్ని ఫెర్రర్ దంపతులు అనంత ఆది దంపతులుగా అభివర్ణించారు.
విదేశాల నుంచి వచ్చే నిధుల దుర్వినియోగ పరిచిన దాఖలాలు మచ్చుకైనా లేవు:. మరి అలాంటి నిస్వార్థ సేవలు అందిస్తోంది.
తల్లితండ్రుల బాటలోనే తనయుడు : తండ్రి ఆశయ సాధనలో తనయుడు మంచూ ఫెర్రర్ పయనిస్తున్నారు. క్రీడాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. స్టేడియం లు నిర్మించారు. సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినో నిర్వహించారు.
ప్రతిసారి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం రెన్యువల్ చేసే సమయానికి ప్రభుత్వం చిక్కులు సృష్టిస్తోంది. ఎలాంటి అరామరికలు లేని సేవలందిస్తున్న ఆర్డిటికీ బ్రేకులు వేస్తే తద్వారా అనంత జిల్లా వాసులు నష్టపోతారు. తిరిగి నిరుద్యోగం తాండవిస్తోంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అంధకారంలో వెళుతుంది.
కూటమి ప్రభుత్వం పునరాలోచించి విదేశీ విరాళాల చట్టం లోబడి పని చేస్తున్న సంస్థ యొక్క సేవలు యధాతతంగా కొనసాగించడానికి పునరుద్ధరణ అనుమతులను తక్షణమే చేపట్టాలని, కూటమి ప్రభుత్వం ఆర్ డి టి సంస్థ పేదలకు చేసిన మంచిని గుర్తించి తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బిజెపి మాజీ తాలూకా యువ మోర్చా అధ్యక్షులు, జిల్లా భారతీయ మద్దూర్ సంఘ్ ఉపాధ్యక్షులు, మాజీ ఆర్డిటి ప్రధానోపాధ్యాయులు మాలపాటి శ్రీనివాసులు, డిమాండ్ చేశారు.

Comments
Post a Comment