చండీగఢ్ పానిపట్‌లోని శ్రీజన్ పబ్లిక్ స్కూల్‌లో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. హోంవర్క్ చేయలేదని ఏడేళ్ల 2వ తరగతి బాలుడిని ప్రిన్సిపాల్ అమానుషంగా శిక్షించాడు. చిన్నారిని కిటికీకి తలకిందులుగా వేలాడదీయడమే కాకుండా, స్కూల్ బస్సు డ్రైవర్‌తో విచక్షణారహితంగా కొట్టించాడు.
ఈ ఘటనతో విద్యార్థి భయభ్రాంతులకు గురయ్యాడు. చూసిన ఇతర పిల్లలు కూడా వణికిపోయారు. చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే ప్రిన్సిపాల్, డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
చిన్నారిపై ఈ రకమైన శారీరక, మానసిక హింస తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యావేత్తలు, తల్లిదండ్రులు “ఈ విధమైన మనస్తత్వం ఉన్నవాళ్లు స్కూల్ నడిపే అర్హత ఉన్నారా?” అని ప్రశ్నిస్తున్నారు. విద్య అనేది భయం కాదు, ప్రేరణ కావాలి అని వారు హితవు పలికారు.

Comments
Post a Comment