అపరిశుభ్రతకు ఆనవాళ్లు పెన్నొబిలంలో కోనేర్లు.

Malapati
0

 ప్రచారం ఉరవకొండ. శుభ్రం గోరంత.

- శ్రీ లక్ష్మీ నరసింహని సాక్షిగా అడుగడుగునా అపరిశుభత్ర




సుప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పెన్నోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దిగువన ఉన్న కోనేరులో చెత్త చెదారం అపరిశుభ్రత తాండవిస్తుంది దేవస్థానం దిగువన ఉన్న పుట్టుశిల ఉద్భవ లక్ష్మమ్మ కోనేరు నిండా చెత్త చెదారం పేరుకుపోయింది. దేవస్థానానికి వచ్చే భక్తులు కోనేరు నుంచి వెదజల్లే దుర్వాసన కంపు భరించలేక పోతున్నారు అమ్మ వారి శరణ నవరాత్రులు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కనీసం శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఆయన శుభ్రం చేయించాలన్న ఇంగితం అంటూ దేవస్థానం అధికారికి గాని సిబ్బందికి గాని ఇంగితం లేకపోయింది అధికారులు సిబ్బంది నెలకు వేలు జీతాలు దొబ్బేస్తున్నారు వచ్చామా? వెళ్ళామా? జీతం పొందామా? అనే ముచ్చటగా మూడు సూత్రాలను శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా అమలు పరుస్తున్నారు. పాల గోపురం దిగువున ఉరవకొండ కు చెందిన అన్న సత్రం పక్కన ఉన్న కోనేరు అపరశుభ్రతతో తాండవిస్తుంది ఇక ఉరవకొండ కు వెళ్లే మార్గంలో ఉన్న నాలుగు స్తంభాల కోనేరు జాడ కనిపించడం లేదు ప్రధాన కోనేరు అపరిశుభ్రతకు కేరాఫ్ గా నిలుస్తాయి. వీటిలోని అపరిశుభ్రత తొలగించక పోగా తాజాగా నూతన ఈవో తిరుమలరెడ్డి 'దెయ్యాలు వేదాలు వళ్ళించిన చందంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏక్ దిన్ ఏక్ గంట శ్రమదానికి కార్యక్రమం చేపట్టినట్లు ఉత్తుత్తి ప్రకటనలు గుప్పిచ్చి భక్తులను మాయలో, భ్రమలో పడేస్తున్నారు. దేవస్థాన సిబ్బంది పంపిన ఫోటోలను పరిశీలించినట్లయితే ఇంతకాలంగా కోనేటి కంపు ఎలా భరించారో అనేది స్పష్టం అవుతుంది. మరి ఎంత మేరకు ఏక్ దిన్ ఏక్ గంటలో శుభ్రం చేయించిన చిత్రాలు పెట్టకపోవడం విడ్డూరం. కేవలం ప్రచారం కొండంత ఉంది ఆచరణ గోరంత ఉంది. 

నాలుగు మాడవీధుల్లో చెత్తాచెదారం రోజువారీగా శుభ్రం చేసి కోనేరు కోనేరులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తే భక్తులు హర్షిస్తారు ఇబ్బడి, ముబ్బుడిగా ప్రచారం కోసం తహతహలాడే ఇలాంటి ప్రకటనలు మానుకోవాలి. పచ్చని చెట్లు కనుమరుగవుతున్నాయి అయినా పట్టించుకోరు లక్షలాది రూపాయలు భక్తుల నుంచి విరాళాల వెళ్ళు వెతుతున్నా రథ నిర్మాణానికి నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. భక్తుల వసతి గృహాల్లో శుభ్రత కరువైంది శ్రీలక్ష్మీ నరసింహ క్షేత్రం అన్నీ ఉన్నా భక్తుల నోట శని అందచందంగా మారింది. పరిశుభ్రత అభివృద్ధిపై అతి జరూరు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరసింహా! పని దొంగలను హుండీ దొంగల్లో మార్పు తెప్పించి దేవస్థాన అభివృద్ధి కోసం మేలుకో స్వామీ!

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!