శాసనసభ, శాసనమండలిలో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత హాజరు నమోదు విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సభ్యులు వారి సీట్లలో కూర్చున్న వెంటనే ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) సాంకేతికత ద్వారా ఆటోమేటిక్‌గా హాజరు నమోదవుతుంది. సభకు హాజరైన, హాజరుకాని సభ్యుల వివరాలు నేరుగా సీఎం డ్యాష్‌బోర్డుకు చేరనున్నాయి.
ఈ వ్యవస్థ అమలు బాధ్యతను హైదరాబాదుకు చెందిన డ్యురాంక్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థకు అప్పగించారు. ప్రస్తుత సమావేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్దిష్ట సమయానికి సభలో సభ్యుల వీడియో రికార్డింగ్ తీసుకుని, డేటాలో నిక్షిప్తం చేసిన ఫొటోలతో సరిపోల్చి జాబితాను సిద్ధం చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత సభలో పీటీజెడ్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి సభ్యుడి ముఖ లక్షణాలను డేటాలో 175 వెక్టార్ పాయింట్ల రూపంలో నమోదు చేస్తారు. కెమెరాలు 180 డిగ్రీల్లో తిరుగుతూ ప్రతి గంటకు సభ్యుల ఫొటోలు సర్వర్‌కు పంపిస్తాయి. అక్కడి ప్రత్యేక సాఫ్ట్వేర్, ముందే నిక్షిప్తం చేసిన వెక్టార్ పాయింట్లతో పోల్చి హాజరైన, గైర్హాజరైన సభ్యుల జాబితాను రూపొందిస్తుంది.
ఇప్పటివరకు సభ్యులు సభ వెలుపల ఉన్న రిజిస్టర్‌లో సంతకాలు చేసి హాజరు నమోదు చేసుకుంటున్నారు. కానీ కొత్త ఏఐ విధానం పూర్తిస్థాయిలో అమలులోకి రాగానే సంతకాల విధానానికి ముగింపు పలికే అవకాశముంది.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

Comments
Post a Comment