భూమన తప్పించుకోలేరు.. విచారణలో అన్నీ బయటపడతాయి: శాప్ ఛైర్మన్ రవినాయుడు
September 21, 2025
0
తిరుపతి :తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన దొంగతనంపై వివాదం రోజు రోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర బయటపడుతుందని శాప్ (SHAP) ఛైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రవినాయుడు మాట్లాడుతూ – “దొంగతనం చేసిన రవికుమార్ నుంచి చాలా మందికి ముడుపులు వెళ్లాయి. ముఖ్యంగా, భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని స్థలాలు తన పేరు మీద రాయించుకున్నాడు. విజిలెన్స్ విచారణలో అన్నీ బయటపడతాయి.. భూమన ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. ఆయన మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి” అని మండిపడ్డారు.
“స్వామి వారి సొమ్ము కాజేసి.. బయటకు వెళ్లి మాట్లాడుకొని సెటిల్‌మెంట్ చేసుకుంటే ప్రాయశ్చిత్తం అవుతుందా?” అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహయాదవ్ కూడా స్పందిస్తూ – “భూమన చెప్పేవన్నీ అబద్దాలే. పరకామణి దొంగతనంపై రవికుమార్ నుంచి భూమన ఎంత వసూలు చేశాడో భక్తుల ముందే చెప్పాలి. వైసీపీ హయాంలో ఈ కేసును సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ చేయించలేదు? చంద్రబాబు, లోకేశ్‌లను విమర్శించే నైతిక హక్కు భూమనకు లేదు” అని ధ్వజమెత్తారు.
టీటీడీ పరకామణి దొంగతనంపై వరుస ఆరోపణలతో తిరుపతి రాజకీయాలు మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి.
