ఆరోగ్యానికి వరంగా నిలిచే బొప్పాయి

0
మన ఆహారపు అలవాట్లలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో బొప్పాయి (Papaya) ఒక అద్భుతమైన సహజ ఔషధం అని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో లభించే ఈ పండు ఆరోగ్యానికి ఎన్నో మేలులు చేస్తుంది. బొప్పాయిలో అధికంగా పీచుపదార్థం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి వైరల్‌ జబ్బులు దూరం అవుతాయి. మధుమేహ రోగులు కూడా భయపడకుండా ఈ పండును తినవచ్చు. దీనిలో సహజ చక్కెర తక్కువగా ఉండటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం కలదు. మోకాళ్ల నొప్పులు, వయో సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి ప్రత్యేకంగా మహిళలకు ఉపయోగకరమని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. నెలసరి క్రమబద్ధంగా రావడంలో, పాలు పెరగడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా విటమిన్ A, E, C, బీటా కెరోటిన్ అధికంగా ఉండటంతో చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇటీవలి కాలంలో పెరుగుతున్న క్యాన్సర్, డెంగ్యూ వంటి వ్యాధులను నివారించడంలో కూడా బొప్పాయి పాత్ర విశేషమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెంగ్యూ రోగులకు బొప్పాయి ఆకుల రసం ఒక వరంగా పనిచేస్తుందని అనుభవాలు చెబుతున్నాయి. 100 గ్రాముల బొప్పాయిలోని ముఖ్య పోషకాలు: శక్తి : 40 kcal పీచు పదార్థాలు : 1.8 g చక్కెరలు : 5.9 g విటమిన్ సి : 61.8 mg (రోజువారీ అవసరానికి 103%) విటమిన్ A, E, బి సమూహ విటమిన్లు సమృద్ధిగా లభ్యం కాల్షియమ్, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. మొత్తం గా, బొప్పాయి కేవలం పండు మాత్రమే కాదు – ప్రతి ఇంటి వైద్యశాలలో తప్పనిసరిగా ఉండాల్సిన సహజ ఔషధం.
Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!