గుంటూరు : గుంటూరు నగరంలోని పట్టాభిపురంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం చుట్టూ అన్యమత పోస్టర్లు అతికించడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ పోస్టర్ల విషయం బయటపడగానే భారతీయ జనతా యువమోర్చా నాయకుడు అంకరాజు శశాంక్ శర్మ ఆధ్వర్యంలో బీజేవైఎం, బజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.వెంటనే విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం, పోస్టర్లు అతికించిన నిర్వాహకులను పిలిపించి వారితోనే పోస్టర్లు తొలగింపజేశారు.ఈ సందర్భంగా ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా ఇరు వర్గాలతో చర్చించి, సమస్యను శాంతియుతంగా పరిష్కరించినట్లు పోలీసులు తెలిపారు.
“పట్టాభిపురంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద అన్యమత పోస్టర్లు తొలగిస్తున్న దృశ్యం.”
Comments
Post a Comment