కణేకల్:
మండలం లోని కె.కొత్తపల్లి గ్రామం లో పీడీ యస్వి యూ ద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూభగత్ సింగ్ జీవితం నేటి యువతరానికి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.గొప్ప స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు.1907 సెప్టెంబర్ 27న జన్మించిన భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే దేశభక్తిని అణువణున నింపుకొని దేశ స్వాతంత్రం కోసం.సమ సమాజ స్థాపన కోసం పోరాటం చేశాడని అన్నారు
వలస పాలకులు జరిపిన జలియన్వాలాబాగ్ మారణకాండ ఆయన్ను 12 సంవత్సరాల ప్రాయంలోనే సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆ సంఘటన భగత్ సింగ్ ను ఆలోచింప చేసిందని గుర్తు చేశారు.సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కరపత్రాలు విసిరి పొగ బాంబులు వేసి విప్లవం వర్ధిల్లాలి అని నినదిస్తూ పారిపోకుండా పోలీసులకు దొరికిపోయారు.
