అనంతపురం జిల్లా డిసిసి అధ్యక్షుడు వై మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో గుంతకల్ నియోజక వర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన హాఫిజ్ అబ్దుల్ మాలిక్, డాక్టర్ అక్బర్ సాబ్, రహిమాన్ సాబ్, సున్ని గౌస్ పీరా, జమీల్ సాబ్, కరీం సాబ్, గోపాల్ తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు మధు సూధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి కు బుద్ధి చెప్పి గద్దె దింపుతూ కాంగ్రెస్ పార్టీలో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా శ్రీమతి షర్మిల రెడ్డి ని చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లుతూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే శంకర్, కేకేసి రాష్ట్ర కార్యదర్శి యం.యం.డి.ఇమామ్, జిల్లా ఉపాధ్యక్షులు ఆలం నవాజ్, ఫిరోజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నబీరసూల్, గుంతకల్లు టౌన్ మాజీ నగర అధ్యక్షులు మహేంద్ర, రామచంద్ర, జిలాన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment