ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు ఉచితంగా అందించే ఎన్టీఆర్ బేబీ కిట్లో రెండు కొత్త వస్తువులు చేర్చారు. ఇటీవల కిట్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అందులో ఫోల్డబుల్ బెడ్ మరియు కిట్ బ్యాగ్ చేర్చాలని ఆదేశించారు.
ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ చర్యలు ప్రారంభించింది. ఇప్పటివరకు బేబీ కిట్‌లో దోమతెరతో కూడిన పరుపు, వాటర్ ప్రూఫ్ షీటు, దుస్తులు, న్యాప్‌కిన్లు, తువాలు, సబ్బు, సబ్బు పెట్టె, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మ ఇలా మొత్తం 11 వస్తువులు ఉండేవి. తాజాగా కొత్త రెండు వస్తువులు చేరడంతో సంఖ్య 13కి పెరిగింది.
గతంలో ఒక్కో కిట్ ఖర్చు సుమారు రూ.1,504 కాగా, ఇప్పుడు అదనంగా రూ.450 వ్యయం కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Comments
Post a Comment