అమరావతి: మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్ల పోస్టింగ్ కోసం వెబ్ ఐచ్ఛికాల నమోదుకు గురువారం నుంచి రెండు రోజులు అవకాశం కల్పించారు.
ఈనెల 9, 10 తేదీల్లో వెబ్ ఐచ్చికాలు నమోదు పూర్తయితే పాఠశాల కేటాయింపు పత్రాలను 11న జారీ చేస్తారు.
ఒకవేళ గడువు పొడిగిస్తే 12న ఇస్తారు. టీచర్లు కొత్త పాఠశాలల్లో 13న చేరాల్సి ఉంటుంది.
కొత్త టీచర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
మెగా డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి.
రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున కొన్ని పోస్టులు మిగిలిపోయాయి.

Comments
Post a Comment