ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 9:
జిల్లా అభివృద్ధి, పరిపాలనా అంశాలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ శ్రీ ఓ. ఆనంద్ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ ని గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతపురం పట్టణంలోని రాంనగర్ వద్ద గల మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీ సందర్భంగా, కలెక్టర్ ఓ. ఆనంద్ మంత్రి కేశవ్ కి పూల మొక్కను (ప్లాంట్‌ను) అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా పరిపాలనలో నూతన ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలు, ఆర్థికపరమైన అంశాలు, కీలక ప్రాజెక్టుల పురోగతి వంటి విషయాలపై ఈ సందర్భంగా వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది..
