నవంబర్ 2న మహోత్సవం

Malapati
0

 అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం


అనంతపురం/ధర్మవరం: అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం (ABKUSS) ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంఘం సభ్యులు మరియు అభిమానుల కోసం ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ఏర్పాటు చేశారు.


గత సంవత్సరం నిర్వహించిన వనభోజన కార్యక్రమం విజయవంతం కావడంతో, ఈ సంవత్సరం కూడా మరింత ఘనంగా నిర్వహించాలని ABKUSS నిర్ణయించింది.

  తేదీ: 02-11-2025 (ఆదివారం)

 సమయం: ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు

  వేదిక: NH-44 ప్రక్కన, హంపాపురం గ్రామం సమీపంలో ఉన్న గౌ|| గోపాల నాగేష్ అండ్ బ్రదర్స్ వారి వ్యవసాయ క్షేత్రం (వెజ్జీ దాబా రాకముందు), అనంతపురం జిల్లా.

 కాకతీయ ఉద్యోగులకు ఆహ్వానం

ABKUSS తమ మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్తీక వనభోజనాలను నిర్వహిస్తున్నట్టు పత్రికలో పేర్కొంది. కాకతీయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులందరూ సకుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కోరారు.


📞 వివరాలకు సంప్రదించండి

కార్యక్రమం వివరాల కోసం, సంఘం సభ్యులు శ్రీ ఉప్పలపాటి నాగేశ్వరరావు (6281595969) మరియు శ్రీ కోనేని మల్లిఖార్జున (7981175112) లను సంప్రదించవచ్చు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!