దళిత దంపతుల భూ వివాదం: సర్వే నంబర్ 89లోని భూమిపై రెవెన్యూ అధికారులకు విచారణ.

Malapati
0


విచారణ కు భాధ్యులు గైర్హాజరీ,

 విచారణ నాన్పుడు  ధోరణి,

 కొనసా......గిస్తున్న గుంతకల్ ఆర్డీవో  

గుంతకల్  ఉరవకొండ మండలం, లత్తవరం గ్రామంలోని సర్వే నంబర్ 89లో తమ పూర్వీకుల భూమిని ఇతరులు అక్రమంగా విక్రయించారని ఆరోపిస్తూ, దళిత వర్గానికి చెందిన దంపతులు గుంతకల్లు రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO)కి ఫిర్యాదు చేశారు.బుధవారం విచారణ ఎదుట భాదిత దంపతులతో బాటు ఉరవకొండ తహసీల్దార్ మహబూబ్ బాషా హాజరు కాగా బాధ్యులు గైర్హాజరీ అయ్యారని 2023 నుంచి ఎంతకాలం కొన సాగిస్తారని మధు బాబు దంపతులు విచారణ అధికారి ఎదుట ఏకరవు పెట్టారు.




ఉరవకొండ రంగా వీధికి చెందిన శ్రీమతి ఆర్. రేణుక (W/o మధుబాబు), ఎం. మధుబాబు (S/o నాగేంద్ర) బుధవారం (తేదీ 08-10-2025) RDO ఎదుట హాజరై తమ సమస్యను విన్నవించారు. వీరు ఎస్సీ మాదిగ కులానికి చెందిన వ్యవసాయ కూలీలు.

భూమి అక్రమ విక్రయంపై ఫిర్యాదు:

దంపతులు తెలిపిన వివరాల ప్రకారం...

 * వివాదాస్పద భూమి: లత్తవరం గ్రామ పొలం సర్వే నంబర్ 89/3 (విస్తీర్ణం 2.40 ఎకరాలు) మరియు సర్వే నంబర్ 89/4 (విస్తీర్ణం 1.20 ఎకరాలు) తమ పూర్వీకులైన మీనుగ లక్ష్మమ్మ (W/o ఎర్రప్ప) నుండి తమకు సంక్రమించింది.

 * అక్రమ విక్రయం ఆరోపణ: సర్వే నంబర్ 89/4 లోని 1.20 ఎకరాల భూమిలో 1.90 సెంట్ల భూమిని తమకు తెలియకుండా, ఉరవకొండకు చెందిన మీనుగ బసవరాజు అనే వ్యక్తి **ఆర్. భీమన్న (S/o రామాంజనేయులు)**కు చట్ట విరుద్ధంగా విక్రయించినట్లు మధుబాబు ఆరోపించారు.

పాసుపుస్తకాల మంజూరులో జాప్యం:

మధుబాబు తన భార్య శ్రీమతి రేణుక పేరు మీద సర్వే నంబర్ 89/3 లోని 2.40 ఎకరాల భూమిని దాన సెటిల్మెంట్ (డాక్యుమెంట్ నెం: 2110/2011) చేయించినప్పటికీ, అప్పటి నుండి ఇప్పటివరకు తమకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, సర్వే నంబర్ 89/4 లోని 1.20 ఎకరాల భూమి కూడా తమ తాతలకు సంబంధించినదేనని, ఈ భూమి విషయంలో గతంలో తాసిల్దార్ సైతం మీనుగ ఓబులపతికి ఎలాంటి డాక్యుమెంట్లు లేవని ధ్రువీకరిస్తూ ఎండార్స్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని RDO దృష్టికి తీసుకెళ్లారు.

దంపతుల డిమాండ్‌లు:

 * పాత పాసుపుస్తకాల రద్దు: రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా నమోదు కాబడినట్లు తాము తెలిపిన పట్టాదారులకు (మీనుగ బసవరాజు S/o గంగప్ప, మీనుగ నాగేంద్ర S/o ఎర్రప్ప, మీనుగ బసవరాజు S/o ఓబులమ్మ, రాయల భీమన్న S/o రామాంజనేయలు) మంజూరైన పాత పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేయాలి.

 * కొత్త పాసుపుస్తకాల మంజూరు:

   * సర్వే నంబర్ 89/3 (2.40 ఎకరాలు) భూమికి ఎం. రేణుక పేరున.

   * సర్వే నంబర్ 89/4 (1.20 ఎకరాలు) భూమికి ఎం. మధుబాబు పేరున.

     తక్షణం పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని దంపతులు RDOని కోరారు.

తమ ఫిర్యాదుకు సంబంధించిన ఆధార్ కార్డులు, డాక్యుమెంట్లు, ECలు, రెవెన్యూ రికార్డుల కాపీలను దంపతులు వినతిపత్రానికి జతపరిచారు. ఈ విషయంపై RDO తగు విచారణ చేపట్టి న్యాయం చేయాలని దంపతులు విజ్ఞప్తి చేశారు.

Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!