'
ఉరవకొండట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 08:
ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలోని తన కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం "ప్రజా దర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నియోజకవర్గ ప్రజలు, నాయకుల నుంచి వివిధ రకాల ప్రజా సమస్యలకు సంబంధించిన అర్జీలు, వినతి పత్రాలను స్వీకరించారు.
అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు లాంటివి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తూ, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు," అని ఆయన పేర్కొన్నారు.
నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన బాధితులు, నాయకులు, ప్రజల సమస్యలను ఆయన అర్జీల రూపంలో స్వీకరించారు.
ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
