న్యూఢిల్లీ: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచే పాఠశాలల్లో మూడో తరగతి (క్లాస్ 3) నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.'ఫ్యూచర్ వర్క్ ఫోర్స్'ను AI-రెడీగా మార్చాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ... ఉపాధ్యాయులు సైతం AI టూల్స్‌ను ఉపయోగించి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేలా ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు.
దీని ద్వారా విద్యార్థులు చిన్నతనం నుంచే AI సాంకేతికతపై ప్రాథమిక అవగాహన పెంచుకోవడానికి వీలవుతుంది. కాగా, ప్రస్తుతం కొన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పాఠశాలల్లో ఇప్పటికే AIపై పాఠాలను బోధిస్తున్నారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా AI విద్యను జాతీయ స్థాయిలో విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది.
Comments
Post a Comment