కనీస మద్దతు ధర లేక మొక్కజొన్న రైతుల దయనీయ స్థితి:

Malapati
0

 .

-ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్సార్‌సీపీ ఆందోళన

  శ్రీ  సత్యసాయి జిల్లా:రాష్ట్రంలో కనీస మద్దతు ధరలు (MSP) లభించక మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైయస్సార్‌సీపీ) నేతలు రైతులను పరామర్శించి నిరసన వ్యక్తం చేశారు.

 శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, రోద్దం మండలం, తాడంగిపల్లి గ్రామంలో శనివారం మొక్కజొన్న రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ రైతులను కలిసి మాట్లాడారు.

అప్పుల ఊబిలోకి రైతులు: ఉషశ్రీ చరణ్

ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

"కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ధర్మమేనా?" అని ఆమె ప్రశ్నించారు.

మొక్కజొన్నతో పాటు మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని వంటి ఏ పంటకు కూడా కనీస మద్దతు ధరలు రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో జోక్యం చేసుకోవాల్సిన కనీస బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని, పైగా రైతులను డ్రామాలతో నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు.

చంద్రబాబుపై మోసం ఆరోపణలు

ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోలు విషయంలో చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఉషశ్రీ చరణ్ ఆరోపించారు.

చంద్రబాబు గారూ... మొక్కజొన్న విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. క్వింటాలుకు రూ.2,800కు కొంటామని చెప్పి, నాఫెడ్‌ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. కానీ, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క క్వింటాల్‌ కూడా కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు," అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు కేటాయించి, ఐదేళ్లలో రూ.7,796 కోట్లు ఖర్చు చేసి అనేక పంటల రైతులను ఆదుకున్నామని ఉషశ్రీ చరణ్ గుర్తు చేశారు. "మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.300 కోట్లు కేటాయించి, అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం దారుణం కాదా?" అని నిలదీశారు.

తక్షణ జోక్యం డిమాండ్‌

ప్రస్తుతం ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు సైతం ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ప్రభుత్వం రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. జనాభాలో 60 శాతం మంది ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర సంక్షోభం ఏర్పడితే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు.

వెంటనే ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో మార్క్‌ఫెడ్ (MARKFED) ద్వారా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!