ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సీఎం సిద్దు
అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మరియు సంఘ నిబంధనలను ఉల్లంఘిస్తూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర కమిటీ నిర్ణయాలు అమలుపరచకుండా రాష్ట్ర కమిటీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సంఘం విషయాలు ఇతరులకు తెలియజేస్తన్నరు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సాయినాథ్ రెడ్డిని సంఘం నుంచి బహిష్కరించాలని రాష్ట్ర కమిటీ తీర్మానించడం జరిగింది. సంఘ సభ్యత్వాలు మరియు ఆర్థిక నిధులు కొన్ని కారణాలను కూడా పరిగణలోకి తీసుకొని విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ చర్చించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏఐఎఫ్డిఎస్ సత్యసాయి జిల్లా కమిటీ రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, పోలీసులు, మేధావులు, విద్యాశాఖ అధికారులు గమనించాలన్నారు. సిద్దాంతాలకు కట్టుబడి నడుస్తున్న ఏఐఎఫ్డిఎస్ నియమ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారిపై ఇదే తరహా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారని త్వరలో నూతన కమిటీ ప్రకటిస్తామని వారు తెలియజేశారు.

Comments
Post a Comment