-అఖిల భారత విద్యార్థి సమాఖ్య :చందు తగ్గుపర్తి
ఉరవకొండ : అనంతపురం జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలలకు నిధులు కేటాయించి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉరవకొండ పట్టణంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ నారాయణ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కరుణాకర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలలకు సంబంధించి గత ప్రభుత్వం నాడు నేడు కింద చేపట్టిన పనులు 80% శాతం పూర్తికాగా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కేజీబీవీకి సంబంధించి ఎక్కడా కూడా పెండింగ్ లో ఉన్న పనులు చేపట్టకుండా కేజీబీవీ పాఠశాలలను గాలికి వదిలేసిందన్నారు కావున వెంటనే పెండింగ్ లో ఉన్న పనులను సరిపడా నిధులు కేటాయించి పూర్తిచేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ కి సంబంధించి ప్రతి పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలినీ,ప్రహరీ గోడలు నిర్మించాలనీ, ప్రతి తరగతికి సంబంధించి ప్రతి సబ్జెక్టుకు బోధనేతర పోస్టులు భర్తీ చేయాలనీ కోరారు.
అదేవిధంగా ఎవరైతే కేజీబీవీ పాఠశాలలో స్థానికంగా లేని ఎస్ ఓ లపై తక్షణమే చర్యలు తీసుకుని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేజీబీవీ పాఠశాలకు పెండింగ్లో ఉన్న నిధులు కేటాయించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ నాయకులు లాలు స్వామి, సిద్ధిక్, మన్సూర్ వలి,రాజు, షాదీక్ తదితరులు పాల్గొన్నారు*

Comments
Post a Comment