వీర లక్ష్మీగా ఉద్భవ లక్ష్మీ

Malapati
0
ఉరవకొండ :అనంతపురం జిల్లా పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారు ప్రతిరోజు ఆదిలక్ష్మి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, మహాలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.                                                               బుధవారం వీరలక్ష్మి అలంకారంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం సుప్రభాత సేవ అనంతరం అమ్మవారికి పసుపు, కుంకుమలతో అర్చనలు నిర్వహించారు. ముత్తైదువులు పట్టు వస్త్రాలు సమర్పించి తమ కోర్కెలు నివేదించారు.                                       ఈ వేడుకల్లో ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకనాతాచార్యులు, ఈవో తిరుమలరెడ్డి, మయూరం బాలాజీ, గుండురావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆశీర్వాదాలు పొందారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!