నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం — జనార్దన్ రావు అరెస్ట్
October 10, 2025
0
అన్నమయ్య జిల్లా:ములకల చెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న విజయవాడకు చెందిన జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా నుంచి జనార్దన్ రావు విజయవాడకు వస్తున్నాడన్న సమాచారం ఆధారంగా పోలీసులు ముందస్తు వ్యూహం రూపొందించారు. బుధవారం ఉదయం అతను గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఎక్సైజ్ సిబ్బంది అతడిని పట్టుకున్నారు.
జనార్దన్ రావు, అతని అనుచరుడు రాజుతో కలిసి ములకల చెరువు కనుగొండ ఆర్చి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారీ యంత్రాంగాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.
ఇటీవల జరిగిన ఎక్సైజ్ దాడుల్లో అధికారులు రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగింది. ఇప్పటికే కేసులో పలు మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
జనార్దన్ రావు అరెస్టుతో కేసు దర్యాప్తు మరింత వేగం పొందనుంది.
Tags
