దివ్యాంగ విద్యార్థులకు విపిఆర్‌ దంపతుల చేయూత

0
నెల్లూరు:నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మరోసారి తమ మానవతా మనసును చాటుకున్నారు. "మాట ఇస్తే తప్పకుండా అండగా నిలుస్తాం" అని చెప్పినట్టుగానే, ఉత్తమ ప్రతిభ చూపిన దివ్యాంగ విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయాణానికి ఆర్థిక సహాయం అందించారు. గురువారం విపిఆర్‌ నివాసంలో జరిగిన కార్యక్రమంలో విద్యా స్వరూపిణికి రూ.1.30 లక్షలు, సిరివల్లికి రూ.1.25 లక్షలు, భవాని పూజితకు రూ.30 వేల రూపాయలు ఫీజుల నిమిత్తం అందజేశారు. ఈ మొత్తాలను విద్యార్థుల తల్లిదండ్రులకు స్వయంగా అందజేసి, విద్యార్థులను ఆశీర్వదించారు. గత జూన్ 9న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “షైనింగ్‌ స్టార్స్‌ అవార్డ్స్” కార్యక్రమంలో నెల్లూరు, పొదలకూరు భవిత కేంద్రాల్లో పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఈ ముగ్గురు విద్యార్థులు అవార్డులు అందుకున్నారు. ఆ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఈ విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. దంపతులు చిన్నారులను ఆశీర్వదిస్తూ, "మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు మా సహాయం కొనసాగుతుంది" అని హామీ ఇచ్చారు. విపిఆర్‌ దంపతుల చేయూతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. “అడగకుండానే అండగా నిలిచిన విపిఆర్‌ దంపతులకు మనఃపూర్వక కృతజ్ఞతలు” అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీసీ వెంకట సుబ్బయ్య, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ప్రసాద్‌రావు, ఎంఈవో మురళి, ఐఈఆర్‌టీలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!