తిరుపతి:శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం (SPCH), తిరుపతిలో మరోసారి గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. రాజమహేంద్రవరానికి చెందిన విజయకృష్ణ (28) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, గుంటూరు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆయన కుటుంబం జీవనాన్ కార్యక్రమం ద్వారా గుండె దానం చేయగా, తిరుపతి ఎస్పీసీహెచ్ లో చికిత్స పొందుతున్న సత్యవేడు ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడికి ఆ గుండె అమర్చాలని నిర్ణయించారు.
టీటీడీ ఈఓ ఆధ్వర్యంలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా గుండెను గుంటూరు నుంచి విజయవాడకు గ్రీన్ ఛానల్ ద్వారా తరలించి, అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి, తరువాత తిరుపతిలోని ఎస్పీసీహెచ్‌కు తీసుకువచ్చారు.
ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ సందీప్, డాక్టర్ హర్ష, డాక్టర్ మధు లు సమన్వయంతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ ఆపరేషన్‌తో ఎస్పీసీహెచ్‌లో గుండె మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య 21కి చేరింది.

Comments
Post a Comment