ఆంధ్ర హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటుపై ఐదోసారి హామీ: ప్రధాని మోడీ సమక్షంలో ప్రకటించిన సీఎం, మంత్రి లోకేష్-హై కోర్ట్ సాధన సమితి సభ్యులు.. అడ్వకేట్ కృష్ణ మూర్తి
కర్నూలు, అక్టోబర్ 17:
రాయలసీమ ప్రాంతంలో ఆంధ్ర హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఎన్. లోకేష్ బాబు నిన్న (అక్టోబర్ 16, 2025) మరోసారి బలంగా హామీ ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఈ విషయాన్ని వారు ఐదోసారి ప్రకటించడం గమనార్హం.
వరుసగా ఐదో వాగ్దానం:
కర్నూలు హైకోర్టు సాధన సమితి విడుదల చేసిన విజ్ఞప్తి ప్రకారం, హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ బాబు గతంలో చేసిన ప్రకటనలను గుర్తు చేస్తూ, ఇది ఐదో హామీ అని పేర్కొన్నారు. ఆ ప్రకటనల వివరాలు:
* 2019 లో: ఆంధ్ర రాష్ట్ర శాసన మండలిలో హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
* 2024 ఎన్నికల ప్రచారం & మేనిఫెస్టో: కర్నూలుకు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు హామీ ఇవ్వడంతో పాటు, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని చేర్చారు. కర్నూలు ఎమ్మెల్యే, పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ కూడా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
* 2024 శాసనసభలో: మూడవసారి ఆంధ్ర శాసనసభలో ఆమోదం తెలిపి హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
* 2025 అసెంబ్లీ సమావేశాల సందర్భంగా: 18-09-2025 నుండి 27-09-2025 వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో, కర్నూలు హైకోర్టు సాధన సమితి రిలే నిరాహార దీక్షలు చేపట్టగా, 27-09-2025న నాల్గవసారి అసెంబ్లీలో ఈ హామీ ఇచ్చారు.
* 2025, అక్టోబర్ 16న: భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో, అశేష రాయలసీమ ప్రజల ముందు, ఐదోసారి ఆంధ్ర హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో తప్పక ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు బలంగా వాగ్దానం చేశారు.
వెంటనే నిధులు కేటాయించాలి: సాధన సమితి విజ్ఞప్తి
ఐదోసారి బలమైన హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ బాబులకు కర్నూలు హైకోర్టు సాధన సమితి ధన్యవాదాలు తెలియజేస్తూనే, వెంటనే భవన నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.
"అమరావతిలో లక్షల కోట్లతో భవనాలు నిర్మిస్తున్నారు. మా రాయలసీమ కర్నూలులో హైకోర్టు బెంచ్‌కు అవసరమైన ప్రభుత్వ భూమి పుష్కలంగా అందుబాటులో ఉంది," అని సమితి పేర్కొంది.
వెంటనే ₹600 కోట్ల నిధులను కేటాయించి, రాయలసీమ ప్రాంతం కర్నూలులో ఆంధ్ర హైకోర్టు బెంచ్‌కు శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలని కర్నూలు హైకోర్టు సాధన సమితి అత్యంత వినయపూర్వకంగా ప్రభుత్వాన్ని కోరింది.

Comments
Post a Comment