![]() |
| భద్రత, సమన్వయంపై మంత్రి ఆదేశాలు |
కర్నూలు: ఈ నెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లాలో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో, ఏర్పాట్లపై కర్నూల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూల్ ఆర్&బీ అతిథి గృహంలో జరిగిన ఈ సమావేశంలో సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి పర్యటనలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొననున్నారు. ఈ తరుణంలో భద్రత మరియు ఇతర ఏర్పాట్లపై మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. సమావేశం అనంతరం, మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ బహిరంగ సభ జరగబోయే ప్రాంగణాన్ని స్వయంగా పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Comments
Post a Comment