విడపనకల్లు, ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 1
వ్యవసాయ పనిముట్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపుపై రైతులకు అవగాహన కల్పించేందుకు విడపనకల్లు మండల కేంద్రంలో బుధవారం 'సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో కీలకమైన ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించి రైతుల్లో చైతన్యం తీసుకువచ్చారు.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, రాయితీలను వివరించేందుకు వ్యవసాయ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది.
వ్యవసాయ అధికారులు, వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది మరియు రైతులు కలిసి మండల కేంద్రంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గింపుతో రైతులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి (ఏఓ) పెన్నయ్య, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ) రామకృష్ణ, వీఐఏ (గ్రామ వ్యవసాయ సహాయకుడు) రమేష్ నాయక్‌తో పాటు నాయకులు చెన్న రాయుడు పాల్గొన్నారు. విడపనకల్ గ్రామానికి చెందిన రైతులు చిక్కన్నయ్య, మల్లేష్, మల్లికార్జున, రమేష్, ఎర్రి స్వామి తదితరులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని జీఎస్టీ తగ్గింపు పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Comments
Post a Comment