_ప్రతి కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాలు ఇంటి ముంగిటకే అందుతున్నాయి_

Malapati
0

 అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి పెన్షన్ అందజేస్తాం_


 ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో ప్రతి కుటుంబంలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది

 సూపర్ సిక్స్--సూపర్ జీఎస్టీ ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు 15 వేలు ఆదా అవుతుంది_

.  పెన్షన్లు--స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన తెదేపా ధర్మవరం అబ్జర్వర్_ నాగేంద్ర కుమార్

ట్రూ టైమ్స్ ఇండియా:ధర్మవరం:ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తుందని ధర్మవరం నియోజకవర్గ తెదేపా పరిశీలకులు నాగేంద్ర కుమార్ అన్నారు.పెన్షన్లు పంపిణీలో భాగంగా ఆయన ధర్మవరం పట్టణం ఇందిరానగర్, పీఆర్టీ విధులలో పెన్షన్లు, స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీలో పాల్గొన్నారు

.ఈ సందర్భంగా తెదేపా నాయకులు రాష్ట్ర ఏపీ సీడ్స్ డైరెక్టర్,రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య,పట్టణ తెదేపా అధ్యక్షుడు పరిసేసుధాకర్, మదీనా మజీద్ కమిటీ అధ్యక్షులు నాగూర్ హుస్సేన్, రామకృష్ణ, వార్డు నాయకులు ఉరుముల ఈశ్వరయ్య గుద్దిటిఅనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మరియు రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్,హుసేన్ మాట్లాడుతూ,గత వైసిపి ప్రభుత్వ 5 ఏళ్ల హయాంలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని వెనక్కి వెళ్లిన ఈ రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారి సహకారంతో నారా చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో దేశంలోనే మన రాష్ట్రాన్ని అభివృద్ధి,సంక్షేమంలో 4వ స్తానంలో నిలిపారని వారు పేర్కొన్నారు. 

అదేవిధంగా రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నారని, కేంద్రం జీఎస్టీ తగ్గింపుతో ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి నెలకు 15 వేల రూపాయల వరకు ఆదా అవుతోందని ఈ సందర్భంగా వారన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 64 లక్షల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతినెల ఒకటో తారీఖున పెన్షన్ దారిని ఇంటి వద్దకు వెళ్లి అందజేస్తున్నామని, తెలియజేశారు.వైసిపి నాయకులు సూపర్ సిక్స్ పథకాలు అమలు కావడం లేదని తమ రోత పత్రికలో గగ్గోలు పెడుతున్నారని వైసిపి నాయకులు ప్రజలకు వద్దకు వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి అడిగి తెలుసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తుందో వాళ్లకు జ్ఞానోదయం కలుగుతుందని తెదేపా నాయకులు ఎద్దేవా చేశారు.

ఈసందర్భంగా ధర్మవరం పట్టణంలో గల ఇందిరానగర్,పీఆర్టీ వీధులలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను,స్మార్ట్ రేషన్ కార్డులను తెదేపా నాయకులు పంపిణీ చేశారు.

ట్రూ టైమ్స్ ఇండియా,

సంపాదకులు,

మాలపాటి శ్రీనివాసులు.

 

 

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!