ఒక ప్రముఖ తెలుగు నటుడు. 1970 వ దశకంలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. 1978 లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని అనే సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆంధ్రా కమల్ హాసన్గా పేరు పొందాడు. సుమారు 110 చిత్రాల్లో నటించాడు. అందులో 90 సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. పలు టీవీ ధారావాహికల్లో కూడా నటించాడు.
నరసింహ రాజు 1974 లో విడుదలైన నీడలేని ఆడది సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో కథానాయికగా నటించిన ప్రభకు కూడా అది మొదటి సినిమానే. ఇది వందరోజులు ఆడి మంచి విజయం సాధించింది. కానీ ఒక ఏడాది పాటూ అవకాశాలు రాలేదు. మళ్లీ అదే నిర్మాతలే అమ్మాయిలూ జాగ్రత్త అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. కానీ ఈ సినిమా సరిగా ఆడలేదు. తర్వాత దాసరి నారాయణ రావు తూర్పు పడమర సినిమాలో అవకాశం ఇచ్చాడు. మరి కొన్ని సినిమాలలో అవకాశం వచ్చింది. 1970 వ దశకం రెండో అర్ధ భాగంలో సుమారు 20 సినిమాల్లో నటించాడు. 1978లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని చిత్రం మంచి విజయం సాధించింది. దీనికి ముందుగానే కొన్ని సినిమాల్లో నటించిన ఉన్న నరసింహరాజు విఠలాచార్య దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా చిత్రీకరణకు వెళ్ళి అవకాశం కోసం అడగగా ఆయన జగన్మోహిని చిత్రంలో అవకాశం ఇస్తానని చెప్పాడు. కథానాయకుడి ఎంపికకు చాలా మందిని అనుకున్నా చివరకు ఈయనకు ఆ అవకాశం దక్కింది. 1993 నుంచి చిత్ర రంగానికి దూరమై టీవీ సీరియళ్ళపై మొగ్గు చూపించాడు. ఎండమావులు, పంజరం, సుందరకాండ మొదలైనవి ఆయన నటించిన కొన్ని సీరియళ్ళు.
సినిమాల జాబితా
• అంతులేని వింతకథ
• అత్తవారిల్లు
• అనుకున్నది సాధిస్తా
• అమ్మాయిలూ జాగ్రత్త
• అయ్యప్ప దీక్ష
• ఇదెక్కడి న్యాయం
• కన్యా కుమారి
• కలియుగ మహాభారతం
• గాంధర్వ కన్య
• జగన్మోహిని
• జయసుధ
• తూర్పు పడమర
• తెగింపు (2005)
• త్రిలోక సుందరి
• నీడలేని ఆడది
• పునాదిరాళ్ళు
• పున్నమినాగు
• ప్రయాణంలో పదనిసలు
• రంభ ఊర్వశి మేనక
• వెంకటేశ్వర వ్రత మహత్యం
• లక్ష్మీ పూజ
• శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం
• సర్దార్ పాపన్న
• పాఠశాల (2014)
• అనుకోని ప్రయాణం (2022)

Comments
Post a Comment