రైస్తో పాటు రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు కూడా అందుబాటులోకి.!
రేషన్ పంపిణీలో పెద్ద మార్పులు రాబోతున్నాయి..!
సెంట్రల్ & స్టేట్ ప్రభుత్వాల సహకారంతో రేషన్ షాపులు మినీ మాల్స్ గా మారనున్నాయని సివిల్ సప్లైస్ మంత్రి నదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇకపై ఉదయం 8 నుండి 12 వరకు, సాయంత్రం 4 నుండి 8 వరకు షాపులు అందుబాటులో ఉంటాయి..
అలాగే 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే సరుకులు చేరే విధంగా సదుపాయం కల్పించనున్నారు..
ఇక కార్డ్ హోల్డర్లు సమీపంలోని ఏ రేషన్ షాపులోనైనా సరుకు తీసుకునే పోర్టబిలిటీ సదుపాయమూ అందుబాటులోకి రానుంది...

Comments
Post a Comment