ఉరవకొండ అక్టోబర్ 19:
గుత్తి మండలం: పుల్లేటి ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ భూ సమాచారం, అక్రమ మ్యూటేషన్ గురించి అడిగిన సమాచారాన్ని గుత్తి తాసిల్దార్ ఇవ్వలేదు. దీంతో అప్పీలు అధికారి అయిన గుంతకల్ ఆర్డీవోను ఆశ్రయించగా ఆయన సమాచారం అందించలేదు. నిర్ణీత గడువు 30 రోజుల్లోగా సమాచారాన్ని సెక్షన్ 7(1 )కింద ఇవ్వకపోతే ఉల్లంఘనే. ఉల్లంఘనా చర్యల్లో భాగంగా సెక్షన్ 20(1) ప్రకారం ఆలస్యానికి గాను బాధ్యత వహించి రోజుకు ₹250 చొప్పున జరిమానా చెల్లించాలని ఆర్ టి ఐ యాక్ట్ లోని సెక్షన్ 20 (2) చెబుతోంది. ఇదే క్రమంలో
అప్పీలు అధికారి ఆర్డీవో సమాచారం ఇప్పించడంలో వైఫల్యం చెందారు. సేవా నిబంధనల ప్రకారం ఆయన కూడా శాఖాపరమైన చర్యలకు బాధ్యులే. అధికారులు ఇద్దరు ఇద్దరే. సమాచారం ఇవ్వని, ఇప్పించని అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారుడు/ ఆప్పీలు దారుడు మాలపాటి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సమాచారం ఇవ్వని అధికారులు: రెండవ అప్పీల్‌కు దరఖాస్తు
సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ, పౌర సమాచార అధికారి (PIO), అప్పీలు అధికారి (AA) నుంచి సమాచారం అందకపోవడంతో అనంతపురం జిల్లాకు చెందిన ఓ దరఖాస్తుదారుడుమాల పాటి శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. సెక్షన్ 19(3) ప్రకారం కమిషన్‌కు రెండవ అప్పీల్‌ను దాఖలు చేశారు.
దరఖాస్తు వివరాలు:
ఉరవకొండకు చెందిన మాలపాటి శ్రీనివాసులు,
, తమ దరఖాస్తులో తాసిల్దార్ కార్యాలయం, గుత్తిలోని పౌర సమాచార అధికారి (PIO)ని తొలిసారిగా సమాచారం కోసం సంప్రదించారు (తేదీ: 19-3-2025). అయితే, పీఐఓ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
అప్పీలు అధికారులపైనా ఫిర్యాదు:
సమాచారం ఇవ్వకపోవడంతో, దరఖాస్తుదారుడు గుంతకల్లులోని ఆర్డీఓ కార్యాలయం (RDO) లోని అప్పీలు అధికారిని (AA) ఆశ్రయించారు (తేదీ: 21-5-2025). అయినప్పటికీ, అప్పీలు అధికారి కూడా పీఐఓ నుంచి సమాచారాన్ని ఇప్పించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో, సమాచార సమర్పణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే తాను రెండో అప్పీల్‌కు వెళ్లాల్సి వచ్చిందని మాలపాటి శ్రీనివాసులు పేర్కొన్నారు.
కోరుతున్న చర్యలు:
తక్షణమే కోరిన సమాచారాన్ని ఇప్పించాలని దరఖాస్తుదారుడు కమిషన్‌ను కోరారు. సెక్షన్ 20(2) ప్రకారం, నిర్ణీత గడువులోగా సమాచారం అందించడంలో విఫలమైనందుకు పీఐఓపై రోజుకు రూ. 250/- చొప్పున జరిమానా విధించాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, అప్పీలు అధికారి కూడా సమాచారం అందించడంలో విఫలమవడాన్ని తీవ్రంగా పరిగణించి, చట్టంలోని సేవా నిబంధనల మేరకు సెక్షన్ 20(2) కింద వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పౌర సమాచార అధికారి, అప్పీలు అధికారి ఇద్దరినీ కమిషనర్ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ శ్రీనివాసులు తమ అప్పీల్‌ను ముగించారు.
సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన ఇరువురు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అధికారులు సహ చట్టానికి తూర్పు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు. సహ చట్టం అమలు అధికారి, చైర్మన్ జిల్లా కలెక్టర్ భాధ్యు లపై చర్యలు తీసుకొని చట్టం అమలు పరచాలని అయన కోరారు.

Comments
Post a Comment