బిజెపిలో రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
కాకినాడ/అనంతపురం: భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాయదుర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని దంటు కళాక్షేత్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వేడుక బిజెపి రాష్ట్ర మొట్టమొదటి మహిళా కార్యదర్శిగా ఎన్నికైన శ్రీమతి సాలిగ్రామం లక్ష్మీ ప్రసన్న గారి సన్మాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ పాక సత్యనారాయణ గారు, ఆదోని ఎమ్మెల్యే శ్రీ పార్థసారథి గారు, ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారు, బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షులు సూర్యనారాయణ గారు, వేటుకూరి సూర్యనారాయణ రాజు గారు, బిజెపి రాష్ట్ర స్పోక్స్ పర్సన్ శ్రీ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఇతర బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులందరూ సాలిగ్రామం లక్ష్మీ ప్రసన్న గారికి అభినందనలు తెలిపి, ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బిజెపి ముఖ్య నాయకులు పాల్గొనడం ద్వారా పార్టీలో మహిళలకు ప్రాధాన్యత, వారి నియామకం పట్ల ఉన్న ప్రాముఖ్యత తెలుస్తోంది.
బీజేపీలో చేరిన రాయదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
ఈ వీడియోలో శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు బిజెపిలో చేరిన సందర్భాన్ని చూడవచ్చు.

Comments
Post a Comment