పెన్నహోబిలం:అక్టోబర్ 19:
"స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర" కార్యక్రమంలో భాగంగా పెన్నహోబిలం దేవస్థానం నేడు (తేదీ: 18-10-2025) మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
దేవస్థానం ప్రాంగణంలో మొత్తం 25 మొక్కలను నాటినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సి.ఎన్. తిరుమల రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఆలయ పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ మొక్కల పెంపకం కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సి.ఎన్. తిరుమల రెడ్డితో సీనియర్ అసిస్టెంట్ మారుతి, ఆలయ సిబ్బంది చురుకుగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా, తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈఓ తిరుమల రెడ్డి పిలుపునిచ్చారు.
అయితే కోనేరుల్లో ని చెత్త చెదారం శుభ్రం చేసిన దాఖలాలు మచ్చుకైనా కనిపించవు. వివో ఆదివారం వచ్చి మొక్కలు నాటించటం పై భక్తులు చెవులు కోరుకుంటున్నారు. దేవస్థాన విధులకు మొక్కుబడిగా వచ్చే ఆయన ఆదివారం వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రచారధ్బాటంలో కాకుండా నిజంగా అమలు చేయాలని చిత్తశుద్ధి ఆయనలో ఉంటే తక్షణమే కోనేరులను శుభ్రం చేయించాలి.
మొక్కలు నాటే ప్రచార ప్రకటన సైతం దేవస్థాన పేరు సైతం ప్రకటనలో లేకపోవటం విడ్డూరంగా ఉంది.

Comments
Post a Comment