ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలో పొరపాటున డబ్బు పంపారా? భయపడాల్సిన అవసరం లేదు!

0
ఇప్పటి కాలంలో చాలామంది డిజిటల్ పేమెంట్ యాప్‌లను — ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సేవలను — విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే కొన్నిసార్లు చిన్న పొరపాటుతో తప్పు వ్యక్తికి డబ్బు పంపే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. తక్షణమే సరైన చర్యలు తీసుకుంటే మీ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

ముందుగా మీరు చేసిన ట్రాన్సాక్షన్ వివరాలు, UPI ID, రిఫరెన్స్ నంబర్, ట్రాన్సాక్షన్ తేదీ, సమయంతో పాటు స్క్రీన్‌షాట్ తీసుకోవడం చాలా అవసరం.

🧾 సహాయం కోసం సంప్రదించవచ్చు:

Google Pay: 📞 1800 419 0157

PhonePe: 📞 080 6872 7374

Paytm: 📞 0120 4456 456

BHIM App: 📞 1800 120 1740


సంబంధిత యాప్ కస్టమర్ కేర్‌ను సంప్రదించి మీ సమస్యను వివరించండి. వారు తప్పుగా పంపిన మొత్తాన్ని మీ ఖాతాలో తిరిగి జమ అయ్యేలా చర్యలు తీసుకుంటారు.

అంతేకాకుండా, మీరు NPCI (National Payments Corporation of India) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి కూడా ఫిర్యాదు (Complaint) చేయవచ్చు.

డిజిటల్ లావాదేవీల్లో చిన్న తప్పిదం పెద్ద నష్టంగా మారకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!