ధర్మవరం పట్టణంలోని లోనికోట ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు స్వయంగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు నందు మరియు మధు లా విన్నపం మేరకు, మంగళవారం హరీష్ బాబు లోనికోట వార్డుకు వెళ్లి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డ్ ప్రజలతో మాట్లాడుతూ, వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. కాల్వలను సకాలంలో శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరు నిలిచిపోవడం, దుర్వాసన వ్యాప్తి వంటి సమస్యలను ప్రజలు వివరించారు. వెంటనే హరీష్ బాబు మున్సిపల్ అధికారులను టెలిఫోన్ ద్వారా సంప్రదించి, కాల్వల శుభ్రత పనులను తక్షణమే ప్రారంభించాలనీ, శానిటేషన్ విభాగం పర్యవేక్షణను నిత్యకృత్యంగా నిర్వహించాలనీ కోరారు. అలాగే వీధి దీపాలు పనిచేయకపోవడం పై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను గమనించి, విద్యుత్ విభాగం సిబ్బందికి దీపాల మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలనీ, రోడ్ల మరమ్మత్తు పనులపై వివరణాత్మక ప్రణాళిక రూపొందించాలనీ మున్సిపల్ అధికారులకు సూచించారు. పాడైన రోడ్లను తక్షణమే మరమ్మతు చేసి, అవసరమున్న చోట కొత్త రోడ్లు వేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని మున్సిపల్ ఇంజినీర్లకు సూచించారు. శానిటేషన్ సిబ్బంది సంఖ్యను పెంచి, చెత్త సేకరణను ప్రతి రోజూ పర్యవేక్షించాలని, ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ,... ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ధర్మవరం పట్టణ అభివృద్ధికి ప్రతి చిన్న అంశాన్నీ గమనిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది, అని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం – హరీష్ బాబు
October 14, 2025
0
