AP: మొంథా తుఫాను నేపథ్యంలో 27, 28, 29 తేదీల్లో విద్యుత్ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు.
ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉంటూ, విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తిన వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.
ఎక్కడైనా పవర్ సప్లైలో అంతరాయం కలిగితే 1912 నంబరును సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
కిందపడిన విద్యుత్ స్తంభాలు, వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి చెప్పారు.
