తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. సోషల్ మీడియాలో రచ్చపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విమర్శలు, వివాదాలు సృష్టించే వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం.. ఏపీ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో మాట్లాడారు. ఇద్దరినీ పిలిచి మాట్లాడతానని పల్లా చెప్పగా.. అవసరం లేదని యూఏఈ నుంచి వచ్చాక తానే దృష్టి పెడతానని స్పష్టం చేసినట్లు సమాచారం.

Comments
Post a Comment