తాడిమర్రి, అక్టోబర్ 17:– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ తాడిమర్రి మండలంలోని సీ.సీ. రేవు మరియు మరి మేకలపల్లి గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల సమస్యపై తక్షణ స్పందన వ్యక్తం చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (CBR) ద్వారా ముంపు కారణంగా ప్రస్తుత రహదారి పూర్తిగా ఉపయోగించరానిదిగా మారి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం అందిన వెంటనే, మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆర్ & బి శాఖ మరియు పులివెందుల బ్రాంచ్ కెనాల్ (PBC) అధికారులకు కొత్త రహదారి నిర్మాణంపై సంయుక్త ఇన్స్పెక్షన్ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి ఆదేశాల మేరకు, శుక్రవారం ఆర్ & బి అధికారులు, PBC ఇంజినీర్లు, ఆయన నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు లు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి, కొత్త రహదారి వేయడానికి అనువైన ట్రాక్ మరియు సైట్ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ,.. ముంపు కారణంగా ఈ ప్రాంత ప్రజలు చాలా కాలంగా రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మార్గదర్శకత్వంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి జరుగుతోంది. రోడ్ పనులు త్వరితగతిన ప్రారంభమై ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు అదే విధంగా ఆయన ఆ ప్రాంత ప్రజలకు భరోసా ఇస్తూ, సత్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ధర్మవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. ఈ రహదారి నిర్మాణం పూర్తవగానే సీ.సీ. రేవు మరియు మరి మేకలపల్లి ప్రజల రాకపోకల సమస్యలు శాశ్వతంగా తీరతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి డి.ఈ పుల్లంరావు, ఏ.ఈ.ఈ. మహాలక్ష్మి, పీబీసీ డి.ఈ. చంద్ర సురేష్, ఏ.ఈ.ఈ. హనీఫ్, బిజెపి నాయకులు సీసీ రేవ్ సోమశేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, రమణ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment