- గోపురాలపై ఇతిహాసాల చిత్రాలు.
- ఉరవకొండ అక్టోబర్ 27
: మండల పరిధిలోని రాయంపల్లి లో శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన పర్వతేశ్వర ఆలయం శిల్పకళలకు కాణాచి గా పేరొందింది. వీటిని తిలకించడానికి భక్తులు ఇటీవల బాగా వస్తున్నారు. కర్ణాటక నుంచి ఇక్కడకు వలస వచ్చిన సిద్దేశ్వర అవధూత ఈ క్షేత్రంలో ఆకలి డప్పులతో అలమటిస్తున్న ప్రజలను చూసి మనసు చలించడంతో తనువు చాలించారు.
- ఈ క్షేత్రంలో ప్రజలు పాడిపంటలకు కొదవ రాకూడదని కోరుతూ జీవ సమాధి పొందారనేది నానుడి. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా మార్చి మాసంలో ఆయన సమాధికి పూజలు చేసి రథోత్సవం చేసుకోవటం ఈ ప్రాంత ప్రజల ఆనవాయితీ.
- కనిపించని కరవు జాడ: ఆయన సమాధికి పూజలు ఆరంభించిన నాటి నుండి నేటి వరకు ఈ ప్రాంతంలో కరువు జాడే లేదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాలానుగుణంగా ఇక్కడ ఆలయం రూపు దిద్దుకుంది. శిల్పకళలకు ముఖద్వార, గర్బాలయా గోపురాల శిల్ప కళా నైపుణ్యం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఏమాత్రం చెక్కుచెదరకుండా సజీవ సాక్షిగా ఉండటం గమనార్హం. గోపురం అందాలు భక్తులను బాగా ఆకర్షిస్తున్నాయి. అప్పట్లో వీటిని సున్నం, గారా, మిశ్రమం చేసి గుండు రాతి కింద వేసి రుబ్బి నిర్మించారు. రెండు గోపురాలపై అద్భుత శిల్పాలు రామాయణ, భాగవతం చాటి చెప్పే చిత్రాలను ముఖద్వార గర్భాలయ గోపురాలపై శిల్పులు చెక్కారు
- గోపురాలపై శిల్పాచార్యులు చూపిన ప్రతిభా, పాటవాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి స్వామివారి దర్శనం అనంతరం గోపురాలను తిలకించి భక్తులు తన్వయత్వం చెందుతారు. గోపురాలపై సప్తవర్ణాలు వినియోగించారు. ఎండకు ఎండీ వానకు తడుస్తున్నా
ఆలయ రంగులు మాత్రం చెక్కుచెదరటం లేదు. పైగా సూర్య కిరణాలు గోపురాలపై పడితే రంగులు తల తల మెరుస్తున్నాయి. రాయంపల్లి నారమెట్ల వ్యాసాపురం నింబగళ్ళు తదితర గ్రామాల భక్తులు ఆలయాన్ని నవీకరించారు. చుట్టూ బండ పరుపులు వేయించారు అంతర్భాగంలో నాపరాళ్ళు వేశారు. భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి గదులు నిర్మించారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు స్వామిగా పర్వతేశ్వరుడు భక్తుల పూజలందుకుంటున్నారు..



Comments
Post a Comment