-సీజనల్ వ్యాధుల దృష్ట్యా పారిశుద్ధ్య పనులు, ఫాగింగ్, బ్లీచింగ్ చేపట్టండి
అనంతపురం అక్టోబర్ 27:
అనంతపురం నగరపాలక సంస్థ నందు సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిప్యూటీ కమీషనర్ డాక్టర్ పావని ను ప్రభుత్వ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు యం.యం.డి.ఇమామ్ కలిసి 2వ డివిజన్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 2వ డివిజన్ పరిధిలో ఉన్న స్థానిక యన్.టి.ఆర్ మార్గ్ లో ప్రతి రోజు పొట్ట కూటికోసం పనుల చేసు కుంటూ ప్రజల రాకపోకలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఇలాంటి రోడ్డుకు ప్రక్కన స్కూల్స్, హాస్టల్, ప్రార్థన మందిరాల కు దగ్గర్లో రోడ్డు పై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, పెద్ద పెద్ద వాహనాలను ఎప్పుడూ నిలిపి ఉండటం, ఆవులు, కుక్కలు గుంపులుగా రోడ్డు పై అడ్డంగా కూర్చోవడం, రోడ్లపై చెత్త చెదారం పడి వుండటం వలన భాగ్యనగర్, అరవేటి నగర్, బిందెల కాలనీ, వినాయక నగర్ వీధుల నుండి వచ్చే ద్విచక్ర వాహన దారులకు, పాదాచారులకు నిత్యం ప్రమాదాలకు గురి అవుతున్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య పనులు, కాలువలను శుభ్రపరచడం చెత్త, చెదారాన్ని తొలగించడం, దోమల బెడదతో నిత్యం విష జ్వరాలతో అనారోగ్యాలకు గురి అవుతున్న ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫాగింగ్, బ్లీచింగ్ చేయాలని తెలిపారు.
ఈ విషయం పై నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాలస్వామి కు గత 6 నెలలుగా ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పొంతన లేని మాటలతో సచివాలయ కార్యదర్శి తో సహా కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడి ప్రజా సమస్యలను పరిష్కార మార్గం చూపే దశలో ప్రత్యేక చొరవ చూపాలని డిప్యూటి కమీషనర్ డాక్టర్ పావని ను ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో అబ్దుల్, మహేష్, భాష తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment