అనుమతి ఒకదానికి.. నిర్మాణం మరొకదానికి.
- రోగం ఒకటైతే చికిత్స మరొకదానికా
- నర్సింగ్ హోమ్ నిర్మాణ జీ+5) అక్రమాలు
ఉరవకొండ అక్టోబర్ 22 : పట్టణంలో ఓ నర్సింగ్ హోమ్ నిర్మాణంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. అనంతపురం అహుడా అనుమతులు లేకుండా జి + 5 బహుళ అంతస్తుల భవనాలు అక్రమంగా నిర్మిస్తున్నారు.ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో శ్రీ ఈశ్వరమ్మ దేవస్థాన సమీపంలో 8 సెంట్లు స్థలాన్ని ఓ వైద్యులు కొనుగోలు చేశారు. కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన చిలకూరి ఎర్రి స్వామి రెడ్డి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు.
సర్వే నంబర్543/ఏ, ప్లాట్ నెంబర్ 1920 ఎనిమిదో సెంట్ల స్థలములో తన నివాస ప్రయోజనం కోసం గ్రామపంచాయతీ వారికి నిర్మాణ అనుమతుల కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. గ్రామపంచాయతీ వారు ఫైల్ నెంబర్26/2024 నందు నివాస ప్రయోజనం కోసం నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు.
అయితే సదరు ఎర్రి స్వామి రెడ్డి నివాస నిర్మాణ అనుమతుల ముసుగులో వ్యాపార ప్రయోజనాల కోసం నర్సింగ్ హోమ్ నిర్మాణం యదేచ్ఛగా సాగిస్తున్నారు.
గ్రామపంచాయతీ నివాస ప్రయోజనం కోసం జి ప్లస్ టు వరకు మాత్రమే అనుమతులు మంజూరు చేస్తారు. అయితే నిర్మాణ అనుమతి నివాసానికి పొంది ఆ ముసుగులో వ్యాపార అవసరాల కోసం నిర్మించడం పలు విమర్శలకు తావిస్తోంది. పంచాయతీ పరిధి నుంచి అనుమతి పొందాలంటే అనంతపురం అహుడా వారి అనుమతి తప్పనిసరి.
రోగం ఒకటైతే చికిత్స మరొకదానికి చేసినట్టు అయింది. సాక్షాత్తు వైద్యుడై ఇలాంటి అక్రమాలకు పాల్పడటం పలు విమర్శలకు తావిస్తోంది
నర్సింగ్ హోమ్ నిర్మాత అనంతపురం అహుడా వారి అను'మతులు' లేకుండా జి ప్లస్ ఫైవ్ నిర్మిస్తూ నిబంధనలకు నీళ్లు దిగారు. బహుళ అంతస్తుల అను'మతి'' లేని ఈ అక్రమ కట్టడం కోసం స్థానిక పంచాయతీ కార్యదర్శి కి, ప్లానర్కు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించారని ఆరోపిస్తూ దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సమాచార హక్కు చట్టం జిల్లా కార్యదర్శి మీనుగ మధుబాబు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
కాగా ఈ విషయమై అహుడా కార్యాలయంలో అనుమతి మంజూరు చేసే వీరేష్ అనే అధికారిని వివరణ కోరగా తాను, తన కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని స్పష్టం చేసినట్లు మధబాబు తెలిపారు.
కాగా పట్టణంలో నానాటికి అనుమతుల్లేని అక్రమ కట్టడాల జోరు ఊపు అందుకుందని జిల్లా అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.


Comments
Post a Comment