ఉరవకొండ అక్టోబర్ 14:
ఈ నెల 16వ తేదీన కర్నూలు పర్యటనలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో, ప్రధాని పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక,మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్షించారు.
మంత్రి పయ్యావుల కేశవ్ సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ అనగాని సత్య ప్రసాద్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం శ్రీశైలం ఆలయాన్ని సందర్శించి, ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం, ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను వారు ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రోటోకాల్ నిబంధనలను తప్పక పాటించాలని అధికారులను ఆదేశించారు.
ప్రధాని రాక సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు, ముఖ్యంగా బాలికలు మరియు మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments
Post a Comment