కళ్యాణదుర్గం రూరల్ సీఐ వంశీకృష్ణను పోలీసు ఉన్నతాధికారులు వీఆర్ కు పంపారు. ఇటీవల సీఐ వంశీ
కృష్ణపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. స్టేషన్ కు వచ్చే ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఫిర్యాదులున్నాయి.
ఈయన తీరుతో స్టేషన్లో పనిచేసే సిబ్బంది సైతం విసుక్కున్నట్లు తెలుస్తోంది. మరీముఖ్యంగా ఓ మహిళ విషయంలో ఈయన వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది
కళ్యాణదుర్గం రూరల్ సర్కిల్లో వ్యవహారాలపై అనేకమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు.
విధుల్లో నిర్లక్ష్యంపై ఉన్నతాధికారుల విచారణ మేరకు సిఐ వంశీకృష్ణ ను విఆర్ కు పంపారు.

Comments
Post a Comment