ఉరవకొండ:ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి,గౌస్ సీఐ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు గురువారం టిడిపి కార్యకర్త, ఎమ్మార్పీఎస్ నేత, జిల్లా సమాచార హక్కు చట్టం కార్యదర్శి మీనుగ మధుబాబు మంత్రికి విన్నవించారు.
గ్రామ కార్యదర్శి అక్రమ, అడ్డగోలు భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ వేలాది రూపాయలు దండుకుంటున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు.
ఒక కార్యకర్తగా తమ గెలుపుకు కృషి చేశామని తెలిపారు. మంత్రి పదవి పయ్యావుల కేశవకుమంత్రి పదవి వరించాలని ఆర్థిక లేక రెవెన్యూ శాఖ పదవి కేటాయించాలని సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చామన్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలన్నారు. ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదన్నారు. ఈ ఇరువురు అధికారులు ప్రతిపక్ష పార్టీకి కొమ్ము కాస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
పట్టణంలో దొంగతనాలు జూదాలు పెట్రేగిపోతున్నాయని వాటిని నియంత్రించడంలో సిఐ విఫలమయ్యారన్నారు అవినీతి అధికారులపై చర్యలు తీసుకొని సుపరిపాలన అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్ ను కలిసి మధుబాబు కోరారు.


Comments
Post a Comment