అమరావతి,ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 7:
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు పలు నిరసన కార్యక్రమాల కార్యాచరణను ఆయన ఖరారు చేశారు.
కోటి సంతకాలు' సేకరణ: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 50 వేల సంతకాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు లక్ష్యం విధించారు.
'రచ్చబండ' కార్యక్రమాలు: ఈ నెల 10 నుంచి 22 వరకు రాష్ట్రంలో వివిధ సమస్యలపై 'రచ్చబండ' పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
గవర్నర్‌ను కలవనున్న జగన్: ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాలపై దృష్టి సారించాలని కోరుతూ వైఎస్ జగన్ నేతృత్వంలో పార్టీ నేతలు నవంబర్ 26న గవర్నర్‌ను కలవనున్నారు.
నిరసన ప్రదర్శనలు: జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కూడా నిరసనలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.
నవంబర్ 12న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
నవంబర్ 28న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని జగన్ ఆదేశించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని, ఇతర ప్రజా సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ నిరసన కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని వైఎస్సార్‌సీపీ అధినేత పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.

Comments
Post a Comment