గుంతకల్ అక్టోబర్ 20:
పోలీస్ అమరవీరుల త్యాగాలను కొనియాడే ఒక్క అవకాశం కల్పించాలని కరెంట్ గోపాల్,,గుంతకల్ డివిజనల్ పోలీసు అధికారిని కోరారు. ఆయన పేరు గోపాల్. ఇంటిపేరు ఉక్కీసుల. ఉక్కీసుల గోపాల్ అంటే ప్రజలు గుర్తుపట్టరు కానీ ఆయనను కరెంట్ గోపాల్ అని పిలిస్తే ప్రజలు ఇట్టే గుర్తుపడతారు. ఉక్కీసుల గోపాల్ అలియాస్ కరెంటు గోపాల్ అంటే కరెక్ట్ గోపాల్ అనే పేరు అయన సంపాదించుకున్నారు.
వృత్తి రీత్యా ఆయన గ్రామపంచాయతీలో సీనియర్ ఎలక్ట్రీషియన్ గా ఎలాంటి అరమరికలు లేకుండా అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ అందరి మెప్పు పొందారు.
ప్రవృత్తి రీత్యా ఆయనలో దేశభక్తి భావనలు అణువు అణువులో నిండిపోయాయి.
దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన దేశ నాయకుల, రాష్ట్ర నాయకుల చరిత్రలు ఆయనకు కొట్టిన పిండి. వారి జయంతోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ప్రజలకు వివరించి వారిలో దేశభక్తి భావనలు పెంపొందిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు సేవలను కొనియాడే అవకాశం కోసం తహతహలాడిపోయారు. దీంతో గుంతకల్ పోలీస్ డివిజన్ అధికారి శ్రీనివాసులను సోమవారం కలిసి పోలీసు సేవలను కొనియాడే ఒక్క ఛాన్స్ తనకు ఇవ్వాలని గోపాల్ కోరారు.
స్పందించిన గుంతకల్ డిఎస్పి శ్రీనివాసులు గోపాల్ కు శాలువ సన్మానించారు. ఆయనలోని దేశభక్తిని మెచ్చుకొని పోలీసు సేవలను కొనియాడే అవకాశం ఇచ్చారు. దీంతో సీనియర్ ఎలక్ట్రీషియన్ గోపాల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
.

Comments
Post a Comment