కర్నూలు ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా నేతపై సంచలన ఆరోపణలు: ఉద్యోగుల వివరాల లీక్‌తో బ్లాక్ మెయిల్

Malapati
0


 

కర్నూలు:అక్టోబర్ 23

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు లీక్ చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారంటూ కర్నూలుకు చెందిన ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా నాయకుడు షేక్ సమీర్‌పై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. నకిలీ ధ్రువపత్రాలు ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత, వారి వివరాలను తన కావాల్సిన వారికి అందించి బ్లాక్ మెయిలింగ్‌కు సహకరిస్తున్నారని భాషోపాధ్యాయ సంఘం (LTA) జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ శ్యావలి బహిరంగంగా ఆరోపించారు.

ముఠా నేత సహకారంతో బ్లాక్ మెయిల్?

షేక్ సమీర్, ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా నాయకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇతను ఇచ్చిన/ఇప్పించిన నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలను తన వారికి చెప్పి బ్లాక్ మెయిల్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నారని శ్యావలి ఆరోపిస్తున్నారు.

పది మంది ఉద్యోగులపై బ్లాక్ మెయిల్ ఉచ్చు?

షేక్ సమీర్ చిరకాల మిత్రుడి కూతురు కూడా "ఫేక్/ఫాల్స్ క్యాస్ట్ సర్టిఫికెట్‌తో" ఉద్యోగం చేస్తోందని శ్యావలి తెలిపారు. ఈమెతో పాటు నకిలీ/తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్న మరో తొమ్మిది మందిని ఒక బ్లాక్ మెయిలర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది.

తొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆ బ్లాక్ మెయిలర్‌కు లోలోపల డబ్బులు సమర్పించుకుని సెటిల్‌మెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. అయితే, ఒక్కరు మాత్రమే డబ్బులు ఇవ్వకపోవడంతో, ఆ బ్లాక్ మెయిలర్ ఆమెపై అధికారులకు ఫిర్యాదు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఆదోనిలో SG టీచర్‌గా పనిచేసి ఉద్యోగం నుంచి తొలగించబడిన నల్లగోడి శ్రీనివాసులు గారికి సంబంధించిన వివరాలు కూడా షేక్ సమీర్ నుంచే తనకు నాలుగో వ్యక్తి ద్వారా చేరాయని షేక్ శ్యావలి వెల్లడించారు.

బ్లాక్ మెయిలర్లకు సలహా

ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్న మోసగాళ్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ శ్యావలి ఘాటుగా స్పందించారు. అటువంటి 420లు, మోసగాళ్లు, వ్యభిచార గృహాలు నిర్వహించుకుని డబ్బులు సంపాదించుకోవాలని, వారికి, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్న వారికి తేడా ఏంటో బ్లాక్ మెయిలర్లు ఆలోచించాలని ఆయన హితవు పలికారు.

ఈ విషయాలను షేక్ శ్యావలి, BA BL TPT BEd PGDWMMT, ఎక్స్ లాంగ్వేజ్ పండిట్ (తెలుగు), జిల్లా ప్రధాన కార్యదర్శి, భాషోపాధ్యాయ సంఘం (LTA), కర్నూలు, తన సెల్ఫోన్ నంబర్లు 96525 13987, 94905 19161 ద్వారా వెల్లడించారు.


Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!