నిరంతరాయ తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి: మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశం

Malapati
0

 

అనంతపురం, అక్టోబర్ 23:



జిల్లా వ్యాప్తంగా ప్రజలకు నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి అనంతపురం నగరంలోని రాంనగర్‌లో గల తన క్యాంప్ కార్యాలయంలో RWS (రూరల్ వాటర్ సప్లై) అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. జిల్లా అంతటా సీపీడబ్ల్యూఎస్ (Comprehensive Protected Water Supply) పథకాలలో మెరుగుదల కనిపించాలని, ప్రజలకు ప్రతిరోజూ తాగునీటి సరఫరా చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.

ముఖ్యంగా, ఉరవకొండ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు సంబంధించిన ప్రాజెక్టు ప్రతిపాదనలపై మంత్రి అధికారులతో చర్చించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు పంపుసెట్లను భర్తీ చేయాలని, ఎస్ఎస్ ట్యాంకులను (Storage Service Tanks) నింపాలని ఆదేశించారు. కొనకొండ్ల ఎస్ఎస్ ట్యాంకులో కూడా మెరుగుదల కనిపించేలా చూడాలని ఆయన సూచించారు. ఎక్కడా తాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలూ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

ఈ సమావేశంలో RWS ఎస్ఈ సురేష్, RWS డీఈలు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!